Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి సీరియస్ : ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (12:08 IST)
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో హుటాహటిన ఆస్పత్రికి తరలించారు. ముఖ్యంగా, తీవ్రమైన జ్వరంతో పాటు.. శ్వాసపీల్చడం కష్టంగా మారడంతో మంత్రిని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయనకు 55 సంవత్సరాలు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం వెల్లడించారు.
 
ఈ ట్వీట్‌లో 'గత రాత్రి నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇదేసమయంలో నా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి పడిపోయింది. నన్నిప్పుడు ఆసుపత్రిలో చేర్చారు. నా ఆరోగ్యంపై పూర్తి వివరాలు తదుపరి తెలియజేస్తాను' అని పేర్కొన్నారు. 
 
కాగా, సోమవారం నాడు అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌తో పాటు సత్యేందర్ జైన్ కూడా హాజరు కావడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. మంత్రి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments