Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. రైళ్ల, విమాన రాకపోకలకు అంతరాయం..

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు పొగమంచుతో ఇబ్బందులు తప్పట్లేదు. వాయు కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడితే తాజాగా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరా

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (09:50 IST)
దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు పొగమంచుతో ఇబ్బందులు తప్పట్లేదు. వాయు కాలుష్యంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడితే తాజాగా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
పొగమంచు కారణంగా 8 అంతర్జాతీయ విమానాలు, 5 దేశీయ విమాన సర్వీసులు, 81 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 అంతర్జాతీయ విమాన సర్వీసులు, 3 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్‌ ఎక్స్‌ ప్రెస్‌ వేస్‌ లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.
 
కాగా దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. దీనివల్ల కొన్ని పాఠశాలలు బయట కార్యక్రమాలను వాయిదా వేయడమే కాకుండా ఆస్తమా విద్యార్థులను స్కూల్‌కు రావద్దని సూచించాయి. ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా ఢిల్లీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments