Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ అవినాష్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అరెస్టుకు లైన్ క్లియర్!

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (16:14 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. ఆయన దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన్న మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఏ క్షణమైనా ఆయన అరెస్టు కావొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు వైఎస్ వివేకానంద రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 
 
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. అదేసమయంలో వివేకా హత్య కేసుకు విధించిన గడువును కూడా సుప్రీంకోర్టు జూన్ 30వ తేదీ వరకు పొడగించింది. 
 
మరోవైపు, విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారితీస్తాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments