Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మహిళను కించపరచలేదు... 56 అంగుళాల ఛాతి ఉన్న వ్యక్తి... రాహుల్

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (13:04 IST)
తాను ఏ ఒక్క మహిళను కించపరచలేదని, ఆమె స్థానంలో మరో మహిళ లేదా పురుషుడు ఉన్నా తాను అలాంటి వ్యాఖ్యలే చేసేవాడినని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 
 
రాఫెల్ స్కామ్‌ విషయంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా సంఘం సుమోటాగా స్వీకరించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. 
 
వీటిపై రాహుల్ స్పందించారు. తాను ఏ మహిళనూ ఉద్దేశించి మాట్లాడలేదని, నిర్మలా సీతారామన్ స్థానంలో ఎవరున్నా అలాంటి వ్యాఖ్యలే చేసేవాడినని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 30 వేల కోట్ల రూపాయలను అప్పనంగా కట్టబెట్టి, తనను తాను రక్షించుకోలేక, మరో వ్యక్తిని నరేంద్ర మోడీ సభలోకి పంపారని ఆరోపించారు. ఆ వ్యక్తి మహిళ కావడం యాదృచ్ఛికమేనన్నారు. 
 
56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకు తిరిగే ఓ కాపలాదారు, మహిళతో తనను కాపాడాలని వేడుకున్నారని, తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్న ఆయన, ఓ మహిళను అడ్డు పెట్టుకున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments