Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుక్కేసింది.. కారు నడిపింది.. అడ్డుకున్న పోలీసుకు ముద్దులిచ్చేసింది..

అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను అడ్డుకున్న పోలీసుకు ముద్దులు పెట్టేసింది. ఈ ఘటన కోల్‌కతాలోని ఈస్ట్రన్ మెట్రోపాలిటిన్‌లోని సాల్ట్‌లేక్ సమీపంలో చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (16:39 IST)
అసలే మందు తాగింది. ఆపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. ఇక ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అంతే తనను అడ్డుకున్న పోలీసుకు ముద్దులు పెట్టేసింది. ఈ ఘటన కోల్‌కతాలోని ఈస్ట్రన్ మెట్రోపాలిటిన్‌లోని సాల్ట్‌లేక్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి మందు కొట్టి కారు నడుపుతూ వచ్చింది. సాల్ట్ లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై నియంత్రణ కోల్పోయింది. 
 
ఇంకా ఎదురుగా వెళుతున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ బండి దిగి.. తాగి కారు నడుపుతున్న మహిళను కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే తప్ప తాగి బండి నడిపిన మహిళ ఆతని చెంపచెళ్లుమనిపించింది. ఈలోగా పోలీసులు కూడా వచ్చేశారు.
 
తాగిన మైకంలో వున్న మహిళపై కేసు రాసుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతుండగా, సదరు మహిళ కానిస్టేబుల్‌ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తింది. అంతే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముద్దుల ద్వారా లంచం ఇవ్వజూపిందని కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments