అంత పని ఎలా చేశావ్ శంకరనారాయణన్... కారును అవలీలగా లాగిపడేస్తే ఎలా?

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (09:12 IST)
కేరళ నదిలో ఇరుక్కుకునిపోయిన ఫార్చ్యునర్ కారును ఓ ఏనుగు అవలీలగా లాగిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఏనుగు పేరు తిరువెంగప్పుర శంకరనారాయణన్. రెండు టన్నులకు పైగా బరువున్న ఫార్చ్యూనర్ కారును శంకరనారాయణన్ సునాయాంగా లాగి గట్టుకు చేర్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ తెల్లటి టయోటా ఫార్చ్యూనర్ వాహనం నదిలో కొంత భాగం మునిగిపోయి, ముందు ఎడమ చక్రం మాత్రమే పైకి కనిపిస్తుండటాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. పరిస్థితి చేయిదాటిపోయిందని అనిపించిన సమయంలో, ఓ మావటి తన ఏనుగు తిరువెంగప్పుర శంకరనారాయణన్‌తో కలిసి అక్కడకు చేరుకున్నాడు. 
 
ఆ తర్వాత, దాదాపు రెండున్నర టన్నులకు పైగా బరువున్న ఆ భారీ వాహనాన్ని శంకరనారాయణన్ అనే ఆ ఏనుగు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే విజయవంతంగా నీటిలోంచి బయటకు లాగింది. టయోటా ఫార్చ్యూనర్ వాహనం పూర్తి బరువు (గ్రాస్ వెహికల్ వెయిట్) సుమారు 2,735 కిలోల వరకు ఉంటుందని, దీనితో ఏనుగు చేసిన ఈ పని మరింత ప్రశంసనీయమని తెలుస్తోంది.
 
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, 'తిరువెంగప్పుర శంకరనారాయణన్... మా చిన్న ఏనుగు...' అనే వ్యాఖ్యను జతచేశారు. భారతీయ సంస్కృతిలో ఏనుగులకు శతాబ్దాలుగా ప్రత్యేక స్థానం ఉంది. వాటి జ్ఞానం, బలం, విశ్వాసాలకు ప్రతీకగా వాటిని పూజిస్తారు. అనేక భారతీయ రాజవంశాలలో కూడా ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో, వాటి సామర్థ్యాలకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments