Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే కారులో రూ.20 వేల కోట్లు... నిజమా?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (09:02 IST)
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ ధన ప్రవాహానికి అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. అనుమానం వచ్చిన ప్రతిచోటా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. కార్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏ వాహనం కనిపించినా వదిలిపెట్టడం లేదు. ఈ తనిఖీల్లో రూ.కోట్ల కొద్దీ నోట్ల కట్టలు వెలుగు చూస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతల నుంచి ఈ నోట్ల కట్టలు పట్టుబడటంతో ఎన్నికల సంఘం అధికారులు నోరెళ్లబెడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఫొటో అందరిని షాక్‌కు గురిచేస్తోంది. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ గడ్గిల్‌కు సంబంధించిన కారులో భారీ నగదు పట్టుబడింది. ఈ వార్త హల్‌చల్ చేసింది. కారులో రూ.20 వేల కోట్ల నగదును ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు రెండు ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. 
 
ఈ రెండు ఫొటోలు కలిపి 'కాంగ్రెస్ సమర్థక్' అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసి.. బీజేపీ నేత సుధీర్ గడ్గిల్ కారులో రూ.20 వేల కోట్లు పట్టుబడినట్టు హిందీలో క్యాప్షన్ పెట్టారు. ఫేస్ బుక్ యూజర్లు సునీల్ కుమార్ సర్కార్, హరి మండియా కామ్రేడ్ .. వీరిద్దరూ కూడా ఈ ఫొటోలను తమ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ పోస్టును ఒకరినుంచి మరొకరు.. షేర్ చేయడంతో.. లక్ష సార్లు ఫేస్‌బుక్‌లో షేర్ అయినట్టు గుర్తించారు. 
 
ఇంత భారీ మొత్తంలో నగదును ఇటీవలే పట్టుబడినట్టుగా అందరిని నమ్మించేలా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలుసుకునేందుకు యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూం బృందం రంగంలోకి దిగింది. జనాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించేలా ఉన్న వైరల్ ఫొటోలపై లోతుగా విచారించింది. ఈ విచారణలో ఈ రెండు ఫొటోలు పాతవని, రెండెంటికి ఒకదానితో ఒకటి సంబంధం లేదని తేల్చేసింది. అంటే.. ఈ రెండు ఫొటోలు ఫేక్ అని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments