Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో చిక్కుకునేలా చేసిన గూగుల్ మ్యాప్.. ఎక్కడ.. ఎలా?

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (14:38 IST)
కొత్త ప్రదేశానికి వెళితే మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం కోసం ఇతరుల సాయం కోరకుండా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతో గూగుల్ మ్యాప్‌ను ఎంచుకుంటాం. ఆ మ్యాప్ చూపించే మార్గంలో ముందుకుసాగిపోతాం. కానీ, అలాంటి గూగుల్ మ్యాపే తప్పు చేస్తే.. ఈ తప్పు వల్ల ఓ కుటుంబం పెను ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. గూగుల్ మ్యాప్ సాయంతో ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి చివరకు నడుం లోతు నీటిలో చిక్కుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటక రాష్ట్రంలోని సర్జాపూర్‌కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో హోసూరుకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరాడు. అయితే, ఈ సారి ఆయన గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నారు. అది చూపించిన దారిలోనే బయలుదేరారు. 
 
అలా తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని బాగేపల్లి వంతెన వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి పరిస్థితులు పట్టించుకోకుండా మ్యాప్‌ను చూసుకుంటా ముందుకు కదిలారు. ఆ తర్వాత కానీ అతడికి తాము ప్రమాదంలో పడినట్టు అర్థంకాలేదు. 
 
తాము భారీ వరద నీటిలో చిక్కుకునిపోయినట్టు తెలుసుకుని కారు వెనక్కి తిప్పే ప్రయత్నం చేసాడు. అయితే, కారు వరద నీటిలో చిక్కుకుని పోవడంతో తన ప్రయత్నం విఫలమైంది. ఇక పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది సాయం కోరారు. 
 
వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్లను ఉపయోగించి వరద నీటిలో చిక్కుకున్న కారును వెలికి తీసి రాజేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను సురక్షితంగా రక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments