Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు 13 కాన్పుల తర్వాత వేసెక్టమీ ఆపరేషన్... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:21 IST)
తమిళనాడులో దంపతుల జంటకు ఎట్టకేలకు 13 మందికి జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేయించేందుకు వైద్యాధికారులు మూడు రోజుల శ్రమించాల్సివచ్చింది. ఆ దంపతులకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని ఒప్పించి, భర్తకు వేసెక్టమీ ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాదైయ్యన్ (46), శాంతి (40) అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇప్పటికే 12 మందికి పిల్లలకు జన్మనిచ్చారు. మతపరమై సంప్రదాయం కారణంగా వీరిద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. గత వారం శాంతి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కాన్పుతో కలిపి మొత్తం 13 మంది పిల్లలు. 
 
ఈ కాన్పు తర్వాత శాంతి తీవ్రమైన రక్తహీనతకు గురైంది. మరో బిడ్డకు జన్మనివాల్సి వస్తే ఆ మహిళ చనిపోయే అవకాశం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కె.శాంతి కృష్ణన్ ఆ దంపతులకు వివరించారు. ఆమెతో పాటు వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులంతా కలిసి ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు కు.ని ఆరేషన్ చేయించుకునేందుకు సమ్మతించారు. దీంతో ఆదివారం ఈరోడ్ జిల్లా అందియూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాదైయ్యన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments