Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే కుటుంబానికి చెందిన ఆ ఐదుగురు ఎలా మృతి చెందారు..

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (16:33 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం హర్యానాలో కలకలం రేపింది. ఈ ఘటనలో కుటుంబ పెద్ద ఉరేసుకుని ఉండగా.. అతని భార్య, ముగ్గురు పిల్లలు మరో గదిలో నేలపై పడి ఉన్నారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పాల్వాల్‌ జిల్లాలోని ఔరంగాబాద్ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఔరంగాబాద్‌ గ్రామంలో బుధవారం ఉదయం నరేష్ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. చాలా సేపు ఎలాంటి కదలికలు లేకపోవడంతో స్థానికులు వారి ఇంటి తలుపులు తెరిచి చూశారు. అక్కడ నరేశ్ (33) ఉరేసుకుని కనిపించాడు. అతని భార్య ఆర్తి(30), పిల్లలు భావన (9), సంజయ్(7), బంధువుల కూతురు రవిత(11)ల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. 
 
నరేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పాల్వాల్ నగర పోలీసు బృందం ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నరేష్ తన భార్య, పిల్లలకు విషం ఇచ్చి వారు చనిపోయిన తర్వాత అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments