Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డులో యువతిపై లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలు తాకాడు.. 300 మందిని లైంగికంగా?

మహిళలకు ఇంటా బయట రక్షణ కరువతోంది. కుమార్తెలపై తండ్రులు, బాలికలపై వృద్ధులు వావివరసలు, వయోభేధం లేకుండా లైంగిక దాడులకు ఒడిగడుతున్న తరుణంలో.. ఇంటికి బయట మహిళలకు పూర్తిగా రక్షణ కరువైంది. ఈ క్రమంలో ఇంటర్వ్య

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (16:05 IST)
మహిళలకు ఇంటా బయట రక్షణ కరువతోంది. కుమార్తెలపై తండ్రులు, బాలికలపై వృద్ధులు వావివరసలు, వయోభేధం లేకుండా లైంగిక దాడులకు ఒడిగడుతున్న తరుణంలో.. ఇంటికి బయట మహిళలకు పూర్తిగా రక్షణ కరువైంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలకు వచ్చే యువతులకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి అబ్దుల్ గని మాలీక్ కుమారుడు హబీబ్ గని (26) అనే యువకుడిని అరెస్టు చేశారు. హబీబ్ ఉన్నత విద్యాభ్యాసం కోసం బెంగళూరులోని ఓ కాలేజీలో చేరాడు. చదువు కోసం బెంగళూరులోని జేపీ నగర్ లోని పుట్టేనహళ్ళిలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు.
 
ఇతనికి అమ్మాయిల పిచ్చితో పాటు అన్నీ చెడు అలవాట్లున్నాయి. అంతేగాకుండా పార్ట్ టైమ్ కోసం పలు కంపెనీలకు ఇంటర్వూలకు వెళ్తుండటం హబీబ్ అలవాటు. ఈ ఇంటర్వ్యూలకు వెళ్లి అక్కడికి వస్తోన్న యువతులకు గాలం వేసి.. యువతులను పరిచయం చేసుకుంటాడు. అమ్మాయిల వివరాలను తెలుసుకుంటాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. పరిచయం చేసుకుంటాడు. అలా హబీబ్ ట్రాప్‌లో పడిపోయిన అమ్మాయిలను అపార్ట్‌మెంట్‌కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటిదాకా ఇలా 300 మంది అమ్మాయిలపై లైంగికంగా దాడి చేశాడని పోలీసులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా ఉడిపికి చెందిన 22 ఏళ్ల యువతి మే 15వ తేదీన బన్నేరుఘట్ట, బీజీ రోడ్డులోని హెచ్‌ఎస్‌డీసీ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్వూకు వెళ్తే ఆమెను కూడా లైంగిక వేధించాడు.. హబీబ్. హెచ్ఎస్‌డీసీ కంపెనీలో తనకు తెలిసిన వాళ్లున్నారని యువతిని నమ్మించాడు. తప్పకుండా ఫ్లాట్‌కు రావాలని ఆమెను బలవంతం చేశాడు.

అందుకు ఆమె నిరాకరించడంతో సదరు కంపెనీ ముందు నడిరోడ్డుపై లైంగిక దాడి చేశాడని ఆరోపణలున్నాయి. ఆ యువతి పట్ల నీచంగా ప్రవర్తించాడని.. ఆమె ప్రైవేట్ భాగాలు తాకాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు హబీబ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం