Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ముసుగులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోన

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (10:43 IST)
మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ముసుగులో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్‌ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్ని అని అందరినీ నమ్మించడు. భక్తి ముసుగులో భక్తులను మోసం చేశాడు. 
 
ఏకంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాలను కూడా నయం చేసేస్తానని మభ్యపెట్టి బాగా డబ్బు గుంజేశాడు. ఇతని వద్దకు సాయం కోసం ఓ మహిళ రావడంతో ఆమెను లోబరుచుకోవాలని సాధువు ప్లాన్ చేశాడు. ఆమెను అతను "గత జన్మలో నువ్వు నా భార్యవు" అంటూ వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. అతనిపైనున్న గుడ్డి నమ్మకంతో ఆమె కూడా అతని వెంట వెళ్లేది. 
 
ఒకసారి అలాగే ఆమెను అసోం తీసుకెళ్లిన సాధువు సాయిలాల్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడి నుంచి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాధువును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఫిర్యాదు చేసిన మహిళ గత జన్మలో తన భార్య అని, అందుకే ఆమెతో అలా ప్రవర్తించానని సాధువు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments