Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించాడు... ఎందుకంటే?

Webdunia
గురువారం, 15 జులై 2021 (13:36 IST)
ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై కొడుతూ లాక్కుని వెళ్లాడు. ఆమె ఒంటి మీద బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించాడు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆమె భర్తతో పాటు మరో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో దాహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. జూలై 6వ తేదీన ఈ ఘటన జరిగినప్పటికీ.. వీడియో వైరల్‌గా మారడంతో వెలుగుచూసింది. దాహోద్ జిల్లా ధన్‌పూర్ తాలుకాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోలో మహిళను ఆమె భర్తతో పాటు, మరికొందరు రోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు. వారిలో చాలా మంది ఆమె భర్త బంధువులే. అందరూ చూస్తుండగానే ఆమెను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించారు. అంతేకాకుండా భర్తను భుజాలపై ఎత్తుకుని నడవాలని బలవంతం చేశారు.
 
ఇందుకు సంబంధించి డీఎస్పీ కరణ్ దేశాయ్ మాట్లాడుతూ.. ఈ నేరానికి పాల్పడిన 19 మందిని గుర్తించినట్టుగా చెప్పారు. మహిళ ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళ పిర్యాదు చేసిందని చెప్పారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
 
'బాధితురాలు ఇటీవల మరో వ్యక్తితో కలిసి పారిపోయింది. దీంతో భార్య కోసం గాలింపు చేపట్టిన భర్త, ఇతర గ్రామస్తులు.. వారిద్దరి ఆచూకీ కనుగొన్నాడు. వెంటనే ఇద్దరిని తిరిగి గ్రామానికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత జూలై 6వ తేదీన ఆమెపై అందరి ముందు దాడి చేశారు. వీడియో ఆధారంగా మహిళపై దాడి చేసిన అందరిని అరెస్ట్ చేశాం' అని పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments