Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులో గుర్మీత్ సింగ్ దోషి.... వివాదాస్పద బాబా పేరున 19 గిన్నిస్ రికార్డులు

అత్యాచారం కేసులో డేరా స్వచ్ఛ సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయనను పంచకుల కోర్టు ప్రాంగణం నుంచి నేరుగా జైలుకు తరలించారు. ఈ అత్

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (15:21 IST)
అత్యాచారం కేసులో డేరా స్వచ్ఛ సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌ బాబా గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయనను పంచకుల కోర్టు ప్రాంగణం నుంచి నేరుగా అంబాలా జైలుకు తరలించారు. ఈ అత్యాచారం కేసులో శుక్రవారం మధ్యాహ్నం హ‌ర్యానా పంచ‌కులలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. 
 
ఈ కోర్టు తీర్పు వెలువడుతుండటంతో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. దీంత అక్క‌డ ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భ‌ద్ర‌తాబ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే హై అల‌ర్ట్ విధించిన విష‌యం తెలిసిందే. 
 
పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలన్నీ రద్దు చేయడమే పలు రైళ్ళ రాకపోకలను నిషేధించారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా, అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్‌కు ఈ నెల 28న కోర్టు శిక్ష ఖ‌రారు చేయనుంది. 
 
కాగా, రేప్ కేసులో దోషిగా కోర్టు నిర్ధారించిన‌ ఆద్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ పేరు మీద 2003 నుంచి 2015 మ‌ధ్య‌ 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్ట‌రై ఉన్నాయి. 15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు నెలకొల్పారు. 
 
2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులు, మ‌ళ్లీ 2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయ‌న పేరు మీద ఉన్నాయి. 
 
వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, షుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌, కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments