Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తపుత్రిక కాదు.. అపుడు నా భార్య... ఇపుడు డేరా బాబా ఉంపుడుగత్తె

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా పేర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్‌ గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె డేరా బాబా దత్తపుత్రిక కాదనీ, విశ్వా

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (06:03 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా పేర్కొంటున్న హనీప్రీత్ ఇన్సాన్‌ గురించి ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె డేరా బాబా దత్తపుత్రిక కాదనీ, విశ్వాస్ గుప్తా అనే వ్యక్తి మాజీ భార్య అని తేలింది. పైగా, హనీప్రీత్ ఇన్సాన్ అసలు పేరు పింకీ తనేజా. డేరా సచ్చా సౌధాకు వెళ్లే భక్తుల్లో విశ్వాస్ గుప్తా ఫ్యామిలీ కూడా ఒకటి. అలా పింకీ తనేజాపై కన్నేసిన డేరా బాబా ఆమెను వశపరుచుకుని తన ఉంపుడుగత్తెగా ఉంచుకున్నాడు.
 
నిజానికి హనీప్రీత్ ఇన్సాన్.... ఈ పేరు పెద్దగా జనానికి తెలియకపోవచ్చు. కానీ డేరా బాబా దత్తపుత్రికగా చాలా ఫేమస్. డేరా బాబా జైలు పాలు కావడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ దత్తపుత్రిక అరాచాకాలు వెలుగులోకి వస్తున్నాయి. పేరుకే దత్త పుత్రిక. కానీ డేరాబాబాతో అక్రమ సంబంధం ఉందని ఆమె భర్తే ఆరోపిస్తున్నాడు. 
 
డేరాబాబా తర్వాత ఆశ్రమంలో హనీప్రీత్ మాటే చెల్లుబాటు అవుతుంది. ఆమెను బాబా అనధికారిక వారసురాలిగా తన వెంటే తిప్పుకునే వాడు. అంతేకాదు డేరా బాబా తీసిన సినిమాలన్నింటికి హనీయే డైరెక్టర్. అనుక్షణం డేరాబాబా వెంటే ఉన్న హనీప్రీత్ నేరం రుజువై పోలీసులు అరెస్టు చేసినప్పుడు కూడా హనీప్రీత్ ఆయన వెంటే ఉన్నారు. ఇపుడు ఈ దత్తపుత్రిక చిక్కుల్లో పడిపోయింది. డేరా బాబా అరెస్టైన వెంటనే అతన్ని జైలు నుంచి తప్పించేందుకు పన్నిన కుట్రలో హనీప్రీత్ కూడా భాగస్వామిగా తేలడంతో హ‌ర్యానా పోలీసులు.. హ‌నీప్రీత్‌పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
 
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ ను జైలుకు తరలించే సమయంలో ఆయన చేతిలో ఎర్రబ్యాగు చూపిస్తే ఆయన్ను తప్పించాలనేది  డేరా గ్యాంగ్ కుట్ర. అయితే కుట్రలో ద‌త్త పుత్రిక హ‌నీప్రీత్ ప్రధాన పాత్రధారి అని తెలుసుకున్న పోలీసులు ఆమె‌పై కేసు నమోదు చేశారు. హ‌నీప్రీత్‌తో పాటు గుర్మీత్ ముఖ్య అనుచ‌రుల కోసం పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు హనీప్రీత్‌కు సంబంధించిన సమాచారం పంపి ఆమె కదలికలపై నిఘా పెట్టారు. దేశం విడిచిపెట్టి పారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments