Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కామాంధులను చంపేయండి : పంజాబ్ హైకోర్టు తీర్పు

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (16:37 IST)
ఒక సామూహిక అత్యాచారం కేసులో పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయిలుగా తేలిన ఏడుగురికి మరణశిక్షలను విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేనా.. రూ.50 లక్షల అపరాధం చెల్లించాలని, ఈ మొత్తంలో 25 లక్షల రూపాయలను బాధితురాలి చెల్లికి, మరో 25 లక్షలను హర్యానా సర్కారుకు ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. 
 
బుధవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, గత 2015లో నేపాల్‌కు చెందిన ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రోహతక్‌లో జరిగింది. మతి స్థిమితం లేని ఆమె, రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
నిర్భయ తరహాలో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో 8 మందిపై కేసు నమోదు చేయగా, అదే యేడాది డిసెంబరులో రోహతక్‌ సెషన్స్‌ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్‌ కూడా ఉన్నారు. తాజాగా కింది కోర్టు తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. అయితే, హత్య కేసులో ముద్దాయిగా తేలిన మైనర్‌కు మాత్రం ఉరిశిక్ష నుంచి మినహాయించింది. 
 
అలాగే, ముద్దాయిలకు భారీ అపరాధం కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రోహతక్‌ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టంచేసింది. ఈ మొత్తంలో ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి రూ.25 లక్షలు చెల్లించాలని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం