Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై తగ్గని అకృత్యాలు.. బీహార్‌లో 17ఏళ్ల బాలుడు ఓ యువతిని?

ఉత్తరప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణార్థం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు కరువైనాయి. యూపీలో మహిళలపై అకృత్యాలు చోటుచేసుకున్నా.. సీఎం ఆదిత్

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (13:18 IST)
ఉత్తరప్రదేశ్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళల రక్షణార్థం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు కరువైనాయి. యూపీలో మహిళలపై అకృత్యాలు చోటుచేసుకున్నా.. సీఎం ఆదిత్య యోగి ఎలాంటి చర్యలు తీసుకోని పరిస్థితి తాజాగా హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అమ్మాయిలపై దుర్మార్గులు లైంగికదాడికి ఒడిగట్టారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్‌ జిల్లాకు చెందిన యువతి(19)ని శనివారం ఓ బాలుడు(17) బలవంతంగా సమీపంలోని చేను వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి జరిపాడు. ఘటనను గమనించిన మరో వ్యక్తి కూడా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపై బాలుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇదే విధంగా అంబాలా జిల్లాలో మే 31న ఇంట్లో నిద్రిస్తున్న యువతి(18)ని ఓ వ్యక్తి కత్తి చూపి బెదిరించి కిడ్నాప్‌ చేశాడు. అనంతరం ఆమెపై లైంగికదాడి జరిపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments