Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ జరిగిందనీ ప్రిన్సిపాల్‌కు చెబితే.. ఇలాంటివి కామనేనన్నారు...

తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన స్నేహితురాల సహకారంతో క్లాస్ టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెబితే ఇలాంటివి జరుగుతుంటాయనీ పెద్దగా పట్టించుకోవద్దని అన్నాడు... దీంతో సూసైడ్ చేసుకోవాలని భావించా. కానీ, తన

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (06:40 IST)
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని తన స్నేహితురాల సహకారంతో క్లాస్ టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెబితే ఇలాంటివి జరుగుతుంటాయనీ పెద్దగా పట్టించుకోవద్దని అన్నాడు... దీంతో సూసైడ్ చేసుకోవాలని భావించా. కానీ, తన స్నేహితురాళ్లు వారించడంతో అఘాయిత్యానికి పాల్పడలేదని ఆ బాలిక రాసిన లేఖ ఇపుడు వాట్సాప్‌లో కలకలం రేపుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హర్యానాలోని గోహానా నగరంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఈ లేఖ రాసింది. కానీ, ఆమె ఎవరో తెలియదు. పాఠశాల కార్యాలయ గదిలో తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని ఆ అజ్ఞాత బాలిక రాసింది. అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ ఇద్దరు సిబ్బంది పేర్లనూ పేర్కొంది. వాట్స్‌ప్‌లో సర్క్యులేట్‌ అవుతున్న ఈ లేఖ కలకలం రేపుతోంది! 
 
ఈ లేఖలో "నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. నా ఫ్రెండ్‌ వారించింది. మేం క్లాస్‌ టీచర్‌ ద్వారా ప్రిన్సిపాల్‌కు చెప్పాం. ఇలాంటివి జరుగుతుంటాయి అని ప్రిన్సిపాల్‌ అన్నారు. స్కూల్‌ డైరెక్టర్‌కు చెబుదామనుకున్నా ఉపయోగం లేదని అనిపించింది. దాంతో మీకు రాస్తున్నా మోడీ అంకుల్‌. నా జీవితాన్ని నాశనం చేశారు" అంటూ ఉన్న ఆ లేఖ అందర్ని కదిలించింది. పాఠశాలలోని సీసీటీవీల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
 
కాగా, ఈ లేఖ రాసిన బాలిక ఎవరో తెలియకపోయినప్పటికీ.. కేసు తీవ్రత దృష్ట్యా, ఆ లేఖ ఆధారంగా హానా నగరంలో ఓ ప్రైవేటు పాఠశాల భవనం ఇన్‌స్పెక్టర్‌ సుఖ్బీర్‌, అకౌంటెంట్‌ కరణ్‌వీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments