Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్సేపై పొగడ్తలు - గాంధీపై విమర్శలు.. కాళీచరణ్ మహారాజ్ అరెస్టు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:17 IST)
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కాళీచరణ్ మహరాజ్ నోటిదూలను ప్రదర్శించి జైలుపాలయ్యాడు. జాతిపిత మహాత్మా గాంధీని దూషించి, గాంధీని చంపిన గాడ్సేపై పొగడ్తల వర్షం కురిపించాడు. అలాగే, ఇస్లాం మతాన్ని కించపిరిచేలా వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కేసు నమోదు కావడంతో చత్తీస్‌గఢ్ పోలీసులు రంగంలోకి దిగి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల రాయ్‌పూర్ వేదికగా ధరమ్ సన్సద్ అనే ఆధ్యాత్మిక సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న కాళీచరణ్.. గాంధీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 505(2), 294 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
 
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ దేశాన్ని నాశనం చేశారనీ, అందుకే ఆయన్ను చంపిన నాథూరామ్ గాడ్సేకు శతకోటి వందనాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహంత్ రామ్ సుందర్ దాస్ ఈ వ్యాఖ్యలకు నిరసనగా వేదిక దిగి వెళ్లిపోయారు.
 
ఆయన వెళ్లిపోవడం, కాళీచరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... కాళీచరణ్ మహారాజ్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహోలో అరెస్టు చేసి రాయపూర్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments