Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా ఎక్కడున్నారో చూపెట్టండి.. డిన్నర్ చేయని హనీప్రీత్ సింగ్

సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకు

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (12:40 IST)
సాధ్వీలపై అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రికగా చెప్పుకునే ప్రియాంకా తనేజా అలియాస్ హనీప్రీత్ సింగ్ జైలులో నిద్రలేని రాత్రి గడిపింది. గుర్మీత్‌ను చూపించాలని హనీప్రీత్ సింగ్ చూపించాలని వేడుకుంది. పంచకుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిమాండ్ ముగిసిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి అంబాలాలోని కేంద్ర కర్మాగారానికి తరలించారు. 
 
జైలులో తొలి రోజు రాత్రి ఆమె భోజనం స్వీకరించలేదని, ఆమెతో పాటు పట్టుబడిన సుఖ్ దీప్ కౌర్ కూడా అదే బ్యారక్‌లో ఉండగా, వీరిద్దరికీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జైలుకు తీసుకురాగానే, ఒక్కసారి తనకు గుర్మీత్‌ను చూపించాలని ఆమె వేడుకుందని అధికారులు తెలిపారు. 
 
హనీప్రీత్ సింగ్‌కు బీపీ పెరిగిందని అంబాలా సివిల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ముగ్గురు డాక్టర్లు రెండు గంటల పాటు ఆమెను పరిశీలించిన అనంతరం చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుందని చెప్పారు. ఒత్తిడి వల్లే రక్తపోటు పెరిగిందని వైద్యులు వెల్లడించినట్లు జైలు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments