Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రియుడితో వుండటం చూసినా పట్టించుకోని భర్త, కానీ భార్య మాత్రం...

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:14 IST)
పెళ్ళి చేసుకుంది. పిల్లలున్నారు. భర్త మాత్రం తాగుడుకు బానిసయ్యాడు. ఇంటి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో ఒక యువకుడికి దగ్గరైంది వివాహిత. భర్తను చంపేస్తే ఈ సుఖం అలాగే ఉంటుంది.. నేను నీతో వచ్చేస్తానంటూ ఆఫర్ ఇచ్చింది. ఆమె మాటలు నమ్మిన ప్రియుడు అతి దారుణంగా వివాహిత భర్తను చంపేశాడు.
 
కర్ణాటక రాష్ట్రం హోస్‌పేట సమీపంలోని టీబీ డ్యాం పిఎల్‌సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి దారుణ హత్యకు గురై పడి ఉన్నాడు. అతని పేరు మైకేల్ జాన్. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
 
భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించిందని నిర్థారణకు వచ్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మైకేల్ జాన్‌కు, సర్గుణంకు పదేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. కూరగాయల మార్కెట్లో షాపును నడిపే మైకేల్ జాన్ మద్యానికి బానిస.
 
పెళ్ళయినప్పటి నుంచి అదే ధ్యాస. అయితే భర్త ఎంతకూ మారకపోవడంతో పాటు ఇంటి పట్టున ఉండకుండా బలాదూర్ తిరగడం.. డబ్బులను ఖర్చు పెట్టడంతో ఇంటి పోషణ కరువైంది. దీంతో భార్య సర్గుణం విసిగిపోయింది. తన ఇంటికి సమీపంలో డిగ్రీ పూర్తి చేసిన వినోద్ అనే యువకుడితో ఆమెకు పరిచయం పెట్టుకుంది.
 
ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య అతడితో సన్నిహితంగా వుండటాన్ని చూసిన భర్త ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. తనకు మద్యం బాటిల్ వుంటే చాలు. జీవితం గడిచిపోద్దన్నట్లుగా సాగాడు. భర్తలో ఎంతకూ మార్పు రాకపోవడం.. ఇంటి పోషణ భారం కావడంతో ప్రియుడితో వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఒక ప్లాన్ చెప్పింది.
 
నా భర్తను చంపేయ్. నేను నీకే. నీతో కలిసి ఉంటానని చెప్పింది. దీంతో నమ్మిన అతను మైకేల్‌ను చంపి రైల్వేట్రాక్ పైన పడేశాడు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments