Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ కు ఫోన్ చేయాలంటే.. ల్యాండ్ లైన్ లో జీరో నొక్కాల్సిందే

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (14:15 IST)
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా  ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలన్నా ముందుగా ‘జీరో’ నొక్కాల్సివుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) గత నవంబరులో ల్యాండ్ లైన్ వినియోగదారులు ఏ మొబైల్ నంబరుకు ఫోను చేయాలన్నా ముందుగా సున్నా నంబరు నొక్కాలని తెలిపింది. ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టెలికం ఆపరేటర్స్ తమ వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేసేందుకు అన్నిఏర్పాట్లు చేశాయి. 
 
ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ లైన్ యూజర్స్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ... డాట్ ఆదేశాలను అనుసరించి 2021, జనవరి 15 నుంచి ఏ ల్యాండ్‌లైన్ నుంచి అయినా మొబైల్‌కు పోన్ చేయాలంటే ముందుగా జీరో ప్రెస్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

ఇదేవిధంగా జియో కూడా తన ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ యూ‌జర్స్‌కు దీనికి సంబంధించిన మెసేజ్ పంపించింది. కాగా ఈ విధానం కేవలం ల్యాండ్ లైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాల్సివచ్చిన్పుడు ఈ విధానం అనుసరించాల్సిన అవసరం లేదు.

డాట్ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ విధానం వలన మొబైల్ సర్వీసెస్ కోసం టెలికం కంపెనీలకు వీలైనంత అత్యధిక నంబర్లు రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

Jwala Gutta: మా నాలుగో వార్షిక సంవత్సరం.. జ్వాలా గుత్తాకు ఆడబిడ్డ.. విష్ణు విశాల్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments