Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి బెడ్‌పైనే గంటలపాటు కరోనా రోగి శవం.. స్మశానవాటిక నుంచి పర్మిషన్ రాలేదట!

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (09:47 IST)
Patna Hospital
కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు ప్రజలు వైరస్ సోకకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కోవిడ్ సోకిన బాధితుల కష్టాలు అంతా ఇంతా కాదు. వైరస్ సోకిందనే బాధ కంటే ఆస్పత్రుల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్న తీరు దారుణంగా ఉంది. ఎందుకు ఈ మాయరోగం మనకు అంటుకుందని చాలామంది బాధపడే స్థాయికి అధికారులు చేర్చుతున్నారు. 
 
ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కరువవయ్యాయి. తాజాగా బీహార్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆస్పత్రిలో కరోనాతో ఓ రోగి మరణిస్తే.. శవాన్ని రోగుల మధ్యే గంటల తరబడి వదిలేశారు. దీంతో భయం భయంగానే మిగితా వారంతా కాలం గడపాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్నాలోని నలంద మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఓ కరోనా బాధితుడు మరణించాడు. 
 
దీంతో అతన్ని మార్చురీకి తరలించకుండా వైద్య సిబ్బంది అతడు ఉంటున్న బెడ్‌పైనే వదిలేసి వెళ్లిపోయారు. గంటలు గడుస్తున్నా ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆ వార్డులో ఉన్న మరో ఏడుగురు రోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో ఆస్పత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై వైద్య కాలేజీ ప్రిన్సిపల్ స్పందించారు. 
 
బాన్స్ ఘాట్ స్మశానవాటికలో రాత్రి 8 గంటల తర్వాతే అనుమతి ఉండటంతో వారిని అలాగే వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన నిర్లక్ష్యపు సమాధానం మరింత వివాదానికి దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడ చికిత్స పొందలేమని రోగులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments