Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ దూకుడు.. సాయం చేయండి ప్లీజ్.. చైనాను కోరిన పాక్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:07 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ తగిన సహాయం అందించవలసిందని వెంటనే చైనాను సంప్రదించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ జిన్హుహా వెల్లడించింది. 
 
జిన్హువా వెల్లడించిన కథనం మేరకు... వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడుతూ భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని ఫిర్యాదు చేసి తిరిగి దాడులు చేసేందుకు సహకరించవలసిందిగా చైనాని కోరగా, అందుకు చైనా అంగీకరించలేదని పేర్కొంది. 
 
భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేసాయని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి తరిమేసాక ఈ దాడులకు సంబంధించిన ఫిర్యాదులేమిటో వాళ్లకే తెలియాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments