Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పోరాడుతుంది.. తిరిగి నవ్వుతుంది : ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (14:31 IST)
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్ శక్తికిమించి పోరాడుతోందని, భారత్ తిరిగి నవ్వుతుందని, ఈ మహమ్మారిపై భారత్ విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 
 
ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఓ మ్యూజిక్ వీడియోను కూడా జతచేశాడు. "భారత్ తిరిగి నవ్వుతుంది, భారత్ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇపుడు ట్విట్టర్‌లో వైరల్ అయింది. 
 
అలాగే, మోడీ అటాచ్ చేసిన మ్యూజిక్ వీడియోలో బాలీవుడ్ తారలు ఆక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా, కార్తీక్ ఆర్యన్, తాప్సీ, అనన్యాపాండే తదితరులు ఇందులో నటించారు. సినీ కుటుంబం వేసిన మంచి అడుగు అని ఈ వీడియోను అభివర్ణించిన ప్రధాని, కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతోందని కితాబిచ్చారు. 
 
'ముస్కురాయేగా ఇండియా' పేరిట ఈ సాంగ్ విడుదలైంది. ఈ కష్టకాలంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉంది. మూడు నిమిషాల, 25 సెకన్లు ఉన్న ఈ వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించడంతో వైరల్ అయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments