Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి పాస్ మార్కులు వేయాలంటూ విద్యార్థి వేడుకోలు!!

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (17:40 IST)
ఓ విద్యార్థి పరీక్ష రాశాడు. కానీ, పరీక్ష ఫెయిల్ అవుతానని తెలుసుకున్న ఆ విద్యార్థి జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి.. తనకు పాస్ మార్కులు వేయాలంటూ వేడుకున్నారు. ఈ విషయం బోర్డు పరీక్షా పేపర్ల మూల్యాంకన సమయంలో వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా వెల్లడించారు. ఆన్సర్ షీట్లను తెరిచినపుడు రూ.100, రూ.200, రూ.200 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చిందని తెలిపారు. బుద్ధిగా చదివి మెరుగైన మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలన్న ఆలోచనకు బదులుగా లంచాలు ఇచ్చి పాస్ అయిపోదామన్న విద్యార్థుల విపరీత ధోరణి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై ఐపీఎస్ అధికారి బోత్రా స్పందిస్తూ "ఈ ఫోటోను ఓ టీచర్ పంపించాడు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలన్న అభ్యర్థన అక్కడ రాసివుంది. మన విద్యార్థులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ గురించి ఇది తెలియజేస్తుంది" అని అరుణ్  బోత్రా తన స్పదనను వ్యక్తం చేసారు. ఈ పోస్ట్‌ను చూసిన కొందరు ఇదే తరహా అనుభవం తమకు కూడా ఎదురైందని మరికొందరు టీచర్లు ట్విట్టర్ వేదికగా స్పందిచారు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులు ఓ విషాద గాథను రాసి డబ్బులు ఉంచుతుండటం టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments