Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ గదిలో భార్యతో ఏకాంతంగా గడిపిన గ్యాంగ్‌స్టర్ ఖైదీ... ఎలాసాధ్యం?

హోటల్ గదిలో భార్యతో ఏకాంతంగా ఓ జైలు ఖైదీ గడిపిన వ్యవహారం ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులు ఆ ఖైదీకి సహకరించేందుకుగాను వారిద్దరు లక్ష రూపాయలవరకు ముడుపులు అందుకున్నారు.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (15:47 IST)
హోటల్ గదిలో భార్యతో ఏకాంతంగా ఓ జైలు ఖైదీ గడిపిన వ్యవహారం ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులు ఆ ఖైదీకి సహకరించేందుకుగాను వారిద్దరు లక్ష రూపాయలవరకు ముడుపులు అందుకున్నారు. 
 
ఓ ఆస్తి వివాదంలో సిడ్కో ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన కేసులో 2013లో గ్యాంగ్‌స్టర్‌ హనుమాన్‌ పాటిల్‌ను అరెస్ట్‌ చేసి తలోజా జైలుకు తరలించారు. అదే యేడాది ఫిబ్రవరి 11న వైద్య పరీక్షల నిమిత్తం పాటిల్‌ను జేజే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇద్దరు ఎస్కార్ట్ పోలీసుల సహకారంతో జైలు నుంచి పారిపోయాడు.
 
ఈనేపథ్యంలో నవీ ముంబై ఎస్కార్ట్‌ టీమ్‌ జేజే మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి పాటిల్‌ను యూపీలో గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పాటిల్‌ను ప్రశ్నించగా ఎస్కార్ట్‌ బృందంలో కొందరు పోలీసులు తన అదృశ్యానికి సహకరించిన తీరును వెల్లడించారు. కొనుగోలు చేసేందుకు అనుమతించాలని జేజే ఆస్పత్రి వద్ద పోలీస్‌ అధికారిని పాటిల్‌ కోరగా, ఇద్దరు ఎస్కార్ట్‌ సిబ్బందిని పాటిల్‌ వెంట ఇచ్చి పంపారని తెలిపారు. 
 
ఆ తర్వాత తమ ఒప్పందంలో భాగంగా, పాటిల్ భార్య మొనాలిని పోలీసులు నేరుగా బ్రైట్‌వే హోటల్‌ రూమ్‌కు తీసుకొచ్చారు. అక్కడ భర్తతో తాను కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు అనుమతించాలని మొనాలి కోరడం‍తో దాదాపు మూడు గంటల పాటు వారిని ఒకే రూమ్‌లో ఉండేందుకు కానిస్టేబుల్స్‌ అనుమతించారు. 
 
ఆ తర్వాత రూమ్‌ డోర్‌ను ప్రెస్‌ చేసిన కానిస్టేబుల్‌కు రూమ్‌లో మొనాలి ఒక్కరే కనిపించడంతో ఎస్కార్ట్‌ బృందం షాక్‌కు గురైంది. హోటల్‌ రూమ్‌ కిటీకి నుంచి నిందితుడు పాటిల్‌ పరారయ్యాడు. పాటిల్‌ దంపతులను ఏకాంతంగా ఉండేందుకు అనుమతించడంతో పాటు మొనాలి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్నందుకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments