Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ.. "దాన్ని" కోసి టాయి‌లెట్‌ బేసిన్‌లో పడేసింది...

కట్టుకున్న భర్త తనను కాదనీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భార్య జీర్ణించుకోలేక పోయింది. దీంతో కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణమైన శిక్షను విధించింది.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (12:16 IST)
కట్టుకున్న భర్త తనను కాదనీ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని భార్య జీర్ణించుకోలేక పోయింది. దీంతో కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా దారుణమైన శిక్షను విధించింది. ఆ శిక్ష ఏంటో తెలుసా... భర్త అంగాన్ని నిలువునా చాకుతో కోసి దాన్ని టాయి‌లెట్‌ బేసిన్‌లో పడేసింది. ఈ దారుణం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జలంధర్, జోగీందర్‌ నగర్‌కు చెందిన ఆజాద్‌ సింగ్‌ అనే వ్యక్తికి సుఖ్వంత్‌ కౌర్‌‌తో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా ఆజాద్ సింగ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై భర్తను పలుమార్లు హెచ్చరించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
దీంతో ఆగ్రహించిన కౌర్.. భర్త నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో తలపై బలంగా మోది, ఆ తర్వాత కత్తితో అతని సున్నిత భాగాలను కోసేసి, టాయిలెట్‌ బేసిన్‌లో పారేసి నీళ్లు పోసింది. దీనిపై ఆజాద్ తండ్రి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, ప్రస్తుతం ఆజాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments