Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కాళ్లు తొలగించలేదు.. నేనే వేళ్లను కట్టాను: అమ్మ డ్రైవర్

దివంగత సీఎం జయలలిత మృతిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమ్మ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్పత్రిలో ఆమెను మూడుసార్లు చూశానని.. అమ్మను అపస్మారక స్థితిలోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆమె మృతిప

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (09:14 IST)
దివంగత సీఎం జయలలిత మృతిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమ్మ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్పత్రిలో ఆమెను మూడుసార్లు చూశానని.. అమ్మను అపస్మారక స్థితిలోనే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ ముందు ఆమె కారు డ్రైవర్ అయ్యప్పన్‌ తెలిపారు. 
 
జయమ్మ మరణించిన తర్వాత ఆమె కాలి వేళ్లను తానే కట్టానని.. డ్రైవర్ చెప్పారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని.. దీంతోనే అపస్మారక స్థితికి చేరుకున్నాక హడావుడిగా ఆస్పత్రికి తరలించినట్లు జయలలిత డ్రైవర్ చెప్పారు. 
 
ఆస్పత్రిలో చేరిన ముప్పావు గంట తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారని వెల్లడించారు.  అయ్యప్పన్ అమ్మ వద్ద పది సంవత్సరాల పాటు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలిపాడు. ఇకపోతే.. 2016 సెప్టెంబరులో అనారోగ్యానికి గురైన జయలలిత చెన్నై అపోలో చికిత్స పొందుతూ డిసెంబర్ ఐదో తేదీన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments