Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్కోటకుడు... తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు నిప్పంటించి...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (19:59 IST)
తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని జీర్ణించుకోలేని అన్న ఇంటికి నిప్పంటించి కుటుంబ సభ్యులను సజీవ దహనం చేసాడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మానిక్‌చక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న మదన్‌తోలా గ్రామంలో మఖాన్‌ మోందల్‌ అనే వ్యక్తి తన ఇద్దరు సోదరులు, తల్లితో కలిసి పెంకుటింటిలో ఉంటున్నారు. 
 
కారుణ్య నియామకం కింద ఇటీవల అతని సోదరుడు గోవిందాకు ఉద్యోగం వచ్చింది. కల్మష హృదయుడైన మఖాన్‌ మోందల్‌ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటికి నిప్పంటించాడు. దాంతో తమ్ముడు గోవిందా (28), అన్న వికాశ్ (32), గోవిందా ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మృతిచందగా, గోవిందా, వికాశ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
గోవిందా భార్య, వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె మాల్దా మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మఖాన్ తల్లి ఆ సమయంలో మరో గదిలో నిద్రిస్తుండటంతో ప్రమాదం నుండి తప్పించుకుంది. మఖాన్‌ భార్య పుట్టింట్లో ఉండటంతో ఆమె కూడా ప్రమాదం నుండి తప్పించుకోగలిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల వారి కుటుంబంలో గేడు మోందల్‌ అనే వ్యక్తి నేషనల్‌ వాలంటీర్‌ ఫోర్సులో ఉద్యోగం చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం క్రింద వికాశ్ సహాయంతో గోవిందా ఉద్యోగం సంపాదించాడు. వారి మరో సోదరుడు లక్ష్మణ్ ఢిల్లీలో ఉంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments