Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో క్షుద్రపూజలు.. తండ్రి శవం ముందు ఆరు నెలల పాటు..

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (14:28 IST)
జార్ఖండ్‌లో క్షుద్రపూజలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. ఇందు కోసం ఆరు నెలలుగా శవానికి పూజలు చేశాడు. కానీ చివరికి అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ఇందిరాకాలనీకి చెందిన విశ్వనాథ్ ప్రసాద్  (75) కొద్దికాలం క్రితం అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు చేయకుండా.. తండ్రిని పూజల ద్వారా బతికిస్తానని నమ్మబలికాడు. 
 
ఇందుకోసం శవాన్ని రసాయనాలతో భద్రపరిచాడు. గత ఆరు నెలల పాటు తండ్రి శవం ముందు కూర్చుని పూజలు చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి శవానికి అంత్యక్రియలు తల్లి, సోదరి చెప్పినా వినిపించలేదు. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ప్రశాంత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments