Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి టాటా చెప్పేసిన గాలి జనార్థన్ రెడ్డి.. కొత్త పార్టీ దిశగా అడుగులు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (16:25 IST)
కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి టాటా చెప్పేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ వచ్చిన ఆయన చివరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఆయన రాజీనామా చేయడం ఇపుడు కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పైగా కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. 
 
కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి... ఆదివారం తన నివాసం పారిజాతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన కళ్యాణ్ రాజ్య ప్రగతి పక్ష అనే పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని తెలిపారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని, కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments