Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరా.. ఆ చిన్నారి ధైర్యం... వీడియో వైరల్

ఓ చిన్నారి తన ప్రాణాలకు తెగించి తన తమ్ముడి ప్రాణాలు రక్షించింది. ఆపద సమయంలో ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్య సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (17:22 IST)
ఓ చిన్నారి తన ప్రాణాలకు తెగించి తన తమ్ముడి ప్రాణాలు రక్షించింది. ఆపద సమయంలో ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్య సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటక రాష్ట్రంలోని కార్వార జిల్లాలోని నవిలాగన్ గ్రామానికి చెందిన కిరణ్ సేత్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించడంతో పిల్లంతా ఇంటిదగ్గరే ఉన్నారు. అయితే, పెద్ద కుమార్తె ఆరతి (8) తన తమ్ముడు కార్తీక్(2)ను ఇంటి ఆవరణలో తోపుడుబండిపై ఎక్కించుకుని ఆడిస్తుంది. 
 
ఇంతలో రోడ్డుపై వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ ఆవు ఎరుపు రంగు చొక్కా వేసుకుని ఆ రెండేళ్ల చిన్నారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆరతి తెలివిగా వ్యవహరించడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆరతి ప్రదర్శించిన ధైర్యం అద్భుతమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments