Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వెలుగు' పూలు పూయిస్తున్న బీటెక్ కుర్రోడు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:24 IST)
కర్నాటక రాష్ట్రంలోని చామరాజ్ నగర్‌లో ఓ బీటెక్ కుర్రోడు వెలుగు పూలు పూయిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వరించినా దాన్ని తిరస్కరించి వ్యవసాయాన్ని నమ్ముకుని, యేడాదికి 15 నుంచి 18 లక్షల మేరకు ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. తన కుమారుడు బీటెక్ పూర్తిచేసి కూడా వ్యవసాయం చేయడం పట్ల అతని తండ్రి మురిసెపోతున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చామరాజ్ నగర్‌కు చెందిన సతీశ్ అనే యువకుడు బీటెక్ పూర్తిచేశాడు. ఆ తర్వాత యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. ఇందులో ఉత్తీర్ణులై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించాడు. అయితే, ఆ ఉద్యోగంలో చేరకుండా, తనకున్న ఎకరా పొలాన్ని నమ్ముకున్నాడు. 
 
ఆ పొలంలో చైనా రకం చామంతులు సాగుచేయసాగాడు. ఈ తరహా పూలు మన దేశంలో కోల్‌కతాలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. చూడచక్కని వర్ణాలతో.. వేడుక ఏదైనా.. అలంకరణకు ఈ పూలు చక్కగా నప్పుతాయి. 12 విభిన్న రంగుల్లో 8 రకాల చామంతులను సాగు చేస్తున్నాడు. 
 
ఒక్కో పువ్వు ధర 3-10 రూపాయల వరకు పలుకుతుంది. ఈ పంటకో విశేషం ఉంది. 24 గంటలూ వెలుతురు అవసరం. దీంతో రాత్రుళ్లు విద్యుత్తు దీపాల వెలుగులందిస్తున్నాడు. బీటెక్‌ చేసి.. యూపీఎస్‌సీ పరీక్షల్లోనూ అర్హత సాధించిన సతీశ్‌ సాగును నమ్ముకోవడంతో ఆయన తండ్రి మురిసిపోతున్నారు. లైట్లు, కూలీలు లాంటి ఖర్చులన్నీ కలిపి ఏడాదికి దాదాపు 6 లక్షలవుతుంటే..ఆదాయం సుమారు రూ. 15-18 లక్షల మధ్య ఉంటున్నట్లు సతీశ్‌ చెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments