Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో కలిసి భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (09:24 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. పడక సుఖం కోసం ఆశపడే స్త్రీపురుషులు... బంధాలు, అనుబంధాలు విస్మరించి క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. తాజాగా తన ఓ భర్త తన ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ దారుణం కర్నటక రాష్ట్రంలోని యశ్వంతపుర సుద్ధగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
సుద్దగుంటపాళ్యలో మహమ్మద్‌ షరిఫా, అప్సర్‌ఖాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. రెండేళ్లుగా అప్సర్‌ఖాన్‌ తన బంధువు తస్లింభానుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్య పలుసార్లు మందలించింది. దీంతో భార్యను అడ్డు తొలగించాలని అప్సర్‌ఖాన్‌ సుపారి ఇచ్చాడు. 
 
ఈ నెల 19న ఆమెను దుండగులు మారణాయుధాలతో హత్య చేశారు. సుద్ధగుంటపాళ్య పోలీసులు అప్పర్‌ఖాన్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేయించినట్లు వెలుగు చూసింది. ఈనెల 19న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 
 
ఈ మేరకు తిలక్‌నగరకు చెందిన అప్సర్‌ఖాన్‌(41), అతడి ప్రియురాలు తస్సింభాను(29), వీరికి సహకరించిన తబ్రేజ్‌పాషా(26), సయ్యద్‌ వసీం(26), వెంకటేశ్‌(19), భరత్‌(18), యుగేంద్ర(19), చేతన్‌(19) ఇబ్రాహిం(19)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో మైనర్‌ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments