Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింగూ కాదు.. మేకూ కాదు :: ఓట్లలో 2 శాతం కోత.. జేడీఎస్‌కు 40 సీట్లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. ముఖ్యంగా, హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే ఖచ్చితంగా ఆ పార్టీ నేత కుమార్ స్వామి కిం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (12:57 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. ముఖ్యంగా, హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే ఖచ్చితంగా ఆ పార్టీ నేత కుమార్ స్వామి కింగ్ మేకర్ అవుతారంటూ జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు సింగపూర్ చెక్కేసిన కుమార్ స్వామి అక్కడ నుంచి మంతనాలు సాగించసాగారు.
 
ఈ నేపథ్యంలో మంగళవారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం కన్నడ ఓటర్లు విస్పష్ట తీర్పునిస్తూ, భారతీయ జనతా పార్టీకి పట్టంగట్టారు. అయితే, 2013 ఫలితాల్లో వచ్చినట్టుగానే 40 సీట్లకే పరిమితమైంది. కానీ, 2 శాతం ఓటింగ్ తగ్గింది. 
 
అయితే జేడీఎస్ కంటే ఎక్కువగా బీజేపీని ఆదరించారు. జేడీఎస్‌ను 40 సీట్లలోనే గెలిపించారు. కాకపోతే కింగ్ మేకర్ స్థాయికి మాత్రం తీసుకెళ్లలేకపోయారు కన్నడ ప్రజలు. బీజేపీ 110 స్థానాల్లో, కాంగ్రెస్ 70 సీట్లలో, జేడీఎస్ 40, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌కు భిన్నంగా ఉన్నాయి. హంగ్ వస్తుందని.. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని విశ్లేషించారు. కానీ, ఆయన కింగూ కాదు.. మేకూ కాదని కన్నడ ఓటర్లు తేల్చిపారేశారు. దీంతో జేడీఎస్ నేతలు డీలా పడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments