Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత పరామర్శ కోసం ఆస్పత్రికి వచ్చిన కరుణానిధి సతీమణి.. శత్రుత్వం ముగిసినట్టేనా?

గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాత్తి అమ్మాళ్, ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలైన కని

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (16:58 IST)
గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు డీఎంకే అధినేత కరుణానిధి భార్య రాజాత్తి అమ్మాళ్, ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలైన కనిమొళిలు ఆస్పత్రికి వచ్చారు. అయితే, వారికి జయలలితను చూసే అవకాశం దక్కలేదు. దీంతో జయలలిత ఆరోగ్యం గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ జయలలిత తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత శనివారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేతలు ఎస్.దురైమురుగన్, కె.పొన్ముడి ఆస్పత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మాళ్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే, డీఎంకే నేతలు బద్ధ శత్రువుల్లాగా వ్యవహరిస్తుంటారు. బంధుత్వం ఉన్నప్పటికీ.. ఈ రెండు పార్టీల్లో చేరారంటే... తమ బంధుత్వాన్ని తెంచుకోవాల్సిందే. అలాగే, ఆయా పార్టీల నేతల శుభకార్యాలకు ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు వెళ్లడానికి వీల్లేదు. అలా వెళ్లారంటే వారు పార్టీ నుంచి బహిష్కరణకు గురికావాల్సిందే. కానీ, జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎంను చూసేందుకు వివిధ పార్టీల నేతలతో పాటు డీఎంకే నేతలు సైతం క్యూ కట్టగం గమనార్హం. 
 
ఇదిలావుండగా, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న జయలలిత శుక్రవారం కళ్లు తెరిచి చూశారని వైద్యులు చెప్పినట్టు వార్తలు రావడంతో ‘అమ్మ’ అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమె కోసం చేసిన పూజలు ఫలిస్తున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి క్షేమంగా బయటకు వస్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments