Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమాలో చూపిన దానికన్నా ఎక్కువ చేశారు..

చనిపోయిన రోగిని ఐసియులో పెట్టి, చికిత్స చేస్తున్నట్లు హడావుడి సృష్టించి, తాము ఎంత ప్రయత్నించినా రోగి బతకలేదని చెప్పి, లక్షల రూపాయల బిల్లు గుంజడానికి ప్రయత్నించే ఓ దృశ్యం ఠాగూర్‌ సినిమాలో చూశాం. కార్పొరేట్‌ ఆస్పత్రుల మోసాలను ఎండగట్టిన ఈ దృశ్యం ప్రేక్ష

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (18:33 IST)
చనిపోయిన రోగిని ఐసియులో పెట్టి, చికిత్స చేస్తున్నట్లు హడావుడి సృష్టించి, తాము ఎంత ప్రయత్నించినా రోగి బతకలేదని చెప్పి, లక్షల రూపాయల బిల్లు గుంజడానికి ప్రయత్నించే ఓ దృశ్యం ఠాగూర్‌ సినిమాలో చూశాం. కార్పొరేట్‌ ఆస్పత్రుల మోసాలను ఎండగట్టిన ఈ దృశ్యం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తమిళనాడులో వాస్తవంగా జరిగిన ఓ ఉదంతాన్ని తెలుకుంటే… ఠాగూర్‌ సినిమాలో చూపినదాన్ని మించి మోసంగా ఎవరైనా అంగీరిస్తారు. తమిళనాడు - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో మణికంఠన్‌ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. 
 
అతడిని సేలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయినా అతను బతకలేదు. అయితే రూ.3 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి. అంత డబ్బులు తాము చెల్లించలేమని మృతుని బంధువులు చెప్పారు. దీంతో మృతుని శరీరం నుంచి మూత్రపిండాలు, కళ్లును తీసేసుకున్నారు ఆస్పత్రి వైద్యులు. మణికంఠన్‌ బంధువులకు మాయమాటలు చెప్పి, అవయవదానం చేస్తున్నట్లు సంతకాలు చేయించుకుని ఈ పని చేశారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేటప్పుడు జరిగిన మోసాన్ని గుర్తించారు. 
 
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త కేరళ సిఎం పినరయ్‌ విజయన్‌ దాకా వెళ్లింది. సంబంధిత ఆస్పత్రిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన తమిళనాడు సిఎంకు లేఖ రాశారు. ఇలాంటి ఆస్పత్రులను శాశ్వతంగా మూసేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. అవయవాలను చోరీ చేయడానికి సహకరించిన వైద్యుల వైద్య పట్టాను రద్దు చేయాలని కూడా రోగులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments