Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్లో దారుణం : తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (09:59 IST)
ఆళపుళ - కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి దారుణ ఘటన ఒకటి జరిగింది. తోటి ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఇద్దరు ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా తయారై ఈ ఘటనకు దారితీసింది. బాధితుడిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిద్దరితో పాటు బాధితుడిన కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లా ఎలాత్తూరులో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆళపుళ -కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికుల వద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితుడుని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించి వారు కూడా గాయాలపాలయ్యారు. మరికొందరు ప్రయాణికులు రైలు చైను లాగారు. దీంతో రైలు వేగం తగ్గిపోవడంతో నిందితుడు బోగి దిగి పారిపోయాడు. బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన పలువురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. రైల్లోని డీ1 బోగీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments