Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతనిని చంపు... నన్ను పండుగ చేస్కో: ఓ యువతి బంపర్ ఆఫర్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:37 IST)
మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చందూ మహాపూర్ కి ఇది వరకే పెళ్లి అయ్యింది. అయితే ఓ యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ యువతికి వేరొకరితో పెళ్లి కుదిరింది.

అయితే ఆమెను పెళ్లి చేసుకోకుండా చందూ మహాపూర్ అడ్డుతగులుతున్నాడు . పెళ్లి చేసుకోవద్దంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 
 
ఇందుకు కోసం చందూ మహాపూర్ సమీప బంధువు గుర్జార్ ని సంప్రదించింది. అతడికి ఎవ్వరూ ఊహించలేని ఆఫర్ ఇచ్చింది. చెప్పినట్టు చేస్తే లక్షన్నర రూపాయలు ముట్టచెప్పడంతో పాటూ ఓ పూట అతడితో ఏకాంతంగా గడుపుతా అని ఆశ పెట్టింది. 
 
భరత్ గుర్జార్ కి చందూ మహాపూర్ కి ఆస్తితగాదాలు ఉన్నాయి. దీంతోపాటు యువతి ఆఫర్ కూడా నచ్చడంతో మర్డర్ కి స్కెచ్ వేశాడు. 
 
మద్యం సేవిద్దాం రమ్మంటూ చందూను నిర్మానుష్య ప్రాంతానికి తీసికెళ్లి, అక్కడ అతడి తల పగల కొట్టి గొంతు కోసి అంతమొందించాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పారేశాడు.

ఘటన సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్జార్‌ను శుక్రవారం నాడు అరెస్టు చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిన యువతితోపాటు ఆమెకు సహరించిన తల్లిదండ్రులపై కూడా పోలీసుల కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments