Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది జ్వరం పోయింది.. ఇపుడు కోతి జ్వరం వచ్చింది.... దీని లక్షణాలేంటి?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (20:35 IST)
నిన్నామొన్నటివరకు పంది జ్వరం (స్వైన్ ప్లూ)తో వణికిపోయారు. ఇపుడు కోతి జ్వరం ప్రతి ఒక్కరినీ గుబులు రేపుతోంది. ముఖ్యంగా, కర్ణాటక రాష్ట్ర వాసులు ఈ జ్వరం పేరు వింటేనే వణికిపోతున్నారు. దీని అసలు పేరు క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్. ఉత్తర కన్నడ జిల్లాలో ఏకంగా వంది మందికి పైగా ప్రజలు ఈ జ్వరంతో బాదఫడుతున్నారు. ముఖ్యంగా, అరలగోడ పంచాయితీ ప్రాంతంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. దీంతో అక్కడి వారంతా భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఇటీవలే యానా అటవీప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిన ఓ ప్రెంచ్ మహిళా పర్యాటకురాలు జ్వరం బారినపడ్డారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి బాగా విస్తృతమైంది. ఫలితంగా అటవీ ప్రాంతానికి, కోతులకు దూరంగా ఉండాలని అధికారులు అక్కడక్కడా హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ రకం జ్వరం ఒక రకమైన పేనుతో వ్యాపిస్తుందని గుర్తించారు. అదేసయమంలో కర్ణాటకలోని అటవీ ప్రాంత పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ తరహా జ్వరం తొలిసారి 1957లో శివమొగ్గ జిల్లాలోని క్యాసనూరు గ్రామంలో ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో క్యాసనూరు ఫారెస్ట్ డిసీజ్‌గా గుర్తించారు. 
 
తీవ్ర జ్వరం, తలనొప్పి, తలతిరుగుడు, వాంతులు, వణుకు గందరగోళం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి ముదిరితే ముక్కు, గొంతు, చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. కేవలం లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స అందిస్తారు. పేను, కోతులు, అడవి ఎలుకలు, గబ్బిలాలు, ఉడుత జాతులు ఈ వ్యాపింపజేస్తాయి. రెండు జిల్లాల్లో 120 కోతులు మరణించాయి. వాటిలో 36 కోతుల్లో వ్యాధి క్రిములు కనిపించాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ కోతులు మరణించడంతో వాటి రక్తనమూనాలను పుణే ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీకి పరీక్షల నిమిత్తం పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments