Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి.. భార్యను అద్దెకు తీసుకోవచ్చు..

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (22:03 IST)
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ భార్యను అద్దెకు కొనుక్కోవచ్చు. ఒక నెల లేదా ఒక సంవత్సరం వరకు ఇలా వేరే వారి భార్యను అద్దెకు తీసుకుని వెళుతుంటారు. అయితే ఇలా మరొకరి భార్యను అద్దెకు తీసుకుని వెళ్లే వాళ్లు కొన్న రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. వేరే వారి భార్యను కొంతకాలం పాటు తాము అద్దెకు తీసుకుంటున్నట్టుగా స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. 
 
రూ. 10 నుంచి రూ. 100 విలువైన స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసి మరి వేరే వ్యక్తి భార్యను అద్దెకు తీసుకుని వెళుతుంటారు ఇక్కడికి వచ్చే బడాబాబులు. ఇలా చేసుకున్న ఒప్పందం ముగిసే వరకు ఆ మహిళ మరో వ్యక్తితో జీవించాల్సి ఉంటుంది. అతడితో పడక సుఖం కూడా పంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు అతడి కుటుంబం మొత్తాన్ని చూసుకోవాలి.
 
మధ్యప్రదేశ్‌లోనే కాకుండా గుజరాత్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్‌కు చెందిన అట్టా ప్రజాపతి అనే వ్యవసాయ కూలీ శిశుహత్య తర్వాత మహిళల కొరత కారణంగా తన భార్య లక్ష్మిని సంపన్న యజమానికి నెల రోజుల పాటు లీజుకు ఇచ్చాడు. ఈ బదిలీ ద్వారా అతను తన నెలవారీ జీతం కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదన పొందుతున్నాడు. 
 
గుజరాత్-మధ్యప్రదేశ్ ప్రాంతంలోని చాలామంది గ్రామస్తులకు ఇది లాభదాయకమైన వ్యాపారం. కొన్ని సందర్భాల్లో మహిళలను రూ.500 కంటే తక్కువకు విక్రయిస్తుండగా, కొన్ని కుటుంబాల్లో వారి కుమార్తెలను కొన్ని సంఘాల్లోని పురుషులకు రూ.50,000లకు అప్పగిస్తున్నారు.
 
ఇలాంటి వ్యాపారాలను ప్రోత్సహించే మధ్యవర్తులు కూడా ఉన్నారు. కుటుంబ పేదరికం నుంచి బయటపడేందుకు మహిళలు ఇలాంటి చర్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments