Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీని చంపిన మరో వ్యక్తి ఎవరు?

జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో వ్యక్తి చంపినట్టు తాజా కథనం. నిజానికి గాంధీ హత్య కేసు విచారణ జరిగి, కోర్టు తీర్పు ప్రకారం గాడ్సేని ఉరితీశారు. క

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (10:23 IST)
జాతిపిత మహాత్మా గాంధీని గాడ్సే చంపినట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ఆయన్ను గాడ్సే పాటు మరో వ్యక్తి చంపినట్టు తాజా కథనం. నిజానికి గాంధీ హత్య కేసు విచారణ జరిగి, కోర్టు తీర్పు ప్రకారం గాడ్సేని ఉరితీశారు. కానీ, ఈ హత్యపై ఇప్పటికీ పలు అనుమానాలు తలెత్తుతూనే ఊన్నాయి. గాడ్సే గాంధీని మూడు బుల్లెట్లతో కాల్చాడని పోలీసులు తేల్చారు.
 
అయితే, గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని, నాలుగో బుల్లెట్ ఆయన శరీరంలోంచి దూసుకుపోవడం వల్లే మరణించారని అప్పట్లో అంతర్జాతీయంగా మీడియాలో ప్రచారం జరిగింది. మరి, ఆ నాలుగో బుల్లెట్‌ను ఎవరు కాల్చారు? ఈ హత్య కుట్రలో గాడ్సే కాకుండా మరో వ్యక్తి వున్నాడా? ఉంటే ఎవరు? అన్న వివాదం అప్పటి నుంచి కొనసాగుతోంది.
 
ఈ నేపథ్యంలో 'ఆధునిక అభినవ భారత్‌' వ్యవస్థాపకుడు డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నీస్‌ సుప్రీంకోర్టులో ఒక పిల్‌ దాఖలు చేశారు. అందులో గాడ్సే కాల్చిన మూడు బుల్లెట్ల వల్ల గాంధీ చనిపోలేదని, నాలుగో బుల్లెట్ వల్లే ఆయన మరణించాడని పేర్కొన్నారు. అందువల్ల గాంధీ హత్యకేసును రీ ఓపెన్‌ చేసి విచారణ చేపట్టాలని కోరారు. 
 
గాంధీకి నాలుగు బుల్లెట్లు తగిలాయని అప్పట్లో ప్రపంచంలోని అన్ని వార్తా పత్రికల్లో వచ్చిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఆ నాలుగో బుల్లెట్‌ ఎక్కిడి నుంచి వచ్చింది? దాన్ని ఎవరు పేల్చారు? అన్న అంశాన్ని అప్పటి పోలీసులు పక్కన పెట్టారని ఆయన తెలిపారు. కాగా, ఈ పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments