Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన పామును కొరికి చంపేసి.. హ్యాపీగా నిద్రపోయాడు.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (18:16 IST)
Sanke
కాటేసిన పాముని వెంటాడి వేటాడి పట్టుకున్నాడు. కసితీరా దాన్ని కొరికి కొరికి చంపేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. పాము అయితే చనిపోయింది కానీ, చివరికి ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. బీహార్‌ రాష్ట్రం నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది.
 
మాధోపూర్‌ గ్రామానికి చెందిన 65ఏళ్ల రామా మహతోని శనివారం రాత్రి ఒక పాము కాటేసింది. దాంతో కోపంతో ఊగిపోయిన మహతో ఆ పాముని వెంటాడి పట్టుకున్నాడు. కసిదీరా కొరికి కొరికి దాన్ని చంపేశాడు. ఇంటిపక్కనే ఉన్న చెట్టుపై వేలాడదీశాడు.
 
మహతో పాముని కొరికి కొరికి చంపడం గమనించి కొందరు గ్రామస్తులు షాక్ తిన్నారు. అలా చేయొద్దని అతడిని వారించారు. అయినా మహతో అస్సలు వినలేదు. తన పని తాను చేశాడు. ఆ తర్వాత, కనీసం ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని గ్రామస్తులు బతిమిలానా పట్టించుకోలేదు. 'పాముని చంపేశాను కదా.. నాకేం కాదులే' అని చెప్పి వారి హెచ్చరికలు పెడచెవిన పెట్టాడు.
 
ఆ తర్వాత భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూడగా మహతో స్పృహ తప్పి పడి పోయి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మహతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments