Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం నాదే, నేను మొఘల్ వారసుడిని?: యాకుబ్

అయోధ్యలో రామ జన్మభూమి స్థలం తనదేనని యాకుబ్ హబీబుద్ధీన్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అయితే బాబ్రీ మసీదును 1992లో కూల్చి వేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్న మీడియా ప్రశ్నకు మాత్రం యాకుబ్‌ సమ

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (08:50 IST)
అయోధ్యలో రామ జన్మభూమి స్థలం తనదేనని యాకుబ్ హబీబుద్ధీన్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. అయితే బాబ్రీ మసీదును 1992లో కూల్చి వేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదన్న మీడియా ప్రశ్నకు మాత్రం యాకుబ్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు.
 
ఇంకా యాకూబ్ మీడియాతో మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు బాబర్‌ది అని, మొఘల్ వంశస్థులకు తాను వారసుడిని కావడంతో ఆ స్థలం తనకే దక్కుతుందని కొత్త వాదనను వినిపించాడు. అంతేగాకుండా మొఘల్ సామ్రాజ్యాధినేత బహదూర్ షా జాఫర్‌కు తానే అసలైన వారసుడని, అందుకు ఇదే సాక్ష్యమంటూ డీఎన్ఏ రిపోర్ట్‌తో సహా మీడియాకు చూపించాడు.
 
ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు తనను ముతవల్లీగా ప్రకటించాలని డిమాండ్ కూడా చేస్తున్నాడు. తనను ముతవల్లీగా ప్రకటించకుంటే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించాడు. అయోధ్యలోని రామ జన్మభూమి స్థలాన్ని తనకు అప్పగించినట్లైతే ప్రస్తుతం నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తానని చెప్పుకొచ్చాడు. 
 
ఇదిలా ఉంటే.. అయోధ్యలో దీపావళి సంబరాలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దీపాల కాంతులతో ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అయోధ్యను పర్యాటక ప్రాంతంగా ప్రచారం చేయడానికే  ‘త్రేతా యుగం నాటి దీపావళి’ని ప్రజల కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. అయోధ్య నగర్‌ నిగమ్‌లో ఉన్న జనాభా 1.71 లక్షలని దానికి సమాన సంఖ్యలోనే దీపావళికి దీపాలు వెలిగించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments