Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ ముంబైలో అగ్నిప్రమాదం - 19వ అంతస్తు నుంచి...

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (15:38 IST)
దక్షిణ ముంబైలో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 61 అంత‌స్తుల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లోని 19వ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఓ వైపు ఎగిసిప‌డుతున్న అగ్నికీల‌లు.. మ‌రో వైపు ద‌ట్ట‌మైన పొగ‌లు.. అగ్నికీల‌ల నుంచి త‌ప్పించుకునేందుకు ఓ వ్య‌క్తి చేసిన సాహ‌సం ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ది.
 
ముంబైలో అవిఘ్న పార్కులోని 61 అంత‌స్తుల భ‌వ‌నంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అయితే, 19వ ఫ్లోర్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో అక్క‌డున్న ఓ 30 ఏళ్ల యువ‌కుడు అరుణ్ తివారీ త‌న ప్రాణాల‌ను కాపాడుకునేందుకు య‌త్నించాడు. 
 
ఈ క్ర‌మంలో ఆ అంత‌స్తులోని బాల్క‌నీలోకి తివారీ వ‌చ్చాడు. అక్క‌డ్నుంచి కింది అంత‌స్తులోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో ప‌ట్టు కోల్పోయి.. కింద జారిప‌డ్డాడు. దీంతో అత‌ను చ‌నిపోయాడ‌ని బీఎంసీ డిజాస్ట‌ర్ కంట్రోల్ అధికారులు వెల్ల‌డించారు.
 
దీనిపై బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చవాల్ స్పందిస్తూ, ద‌క్షిణ ముంబైలోని అవిఘ్న పార్కులోని 64 అంత‌స్తుల భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగిన‌ట్లు ఉద‌యం 11:55 గంట‌ల‌కు త‌మ‌కు స‌మాచారం అందడంతో త‌క్ష‌ణ‌మే అక్క‌డికి వెళ్లిన‌ అగ్నిమాప‌క సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంద‌ని చెప్పారు. 
 
ఆ అంత‌స్తులో ఉన్న అంద‌రూ ప్రాణాల‌తో తెలిపారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని బీఎంసీ క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ముంబై మేయ‌ర్ కిషోరి ప‌డ్నేక‌ర్ ప్ర‌మాద స్థ‌లికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments