Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ ఆడుకునేందుకు ఇవ్వలేదని తమ్ముడిని అలా చంపేసింది..

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (11:13 IST)
స్మార్ట్ ఫోన్లు మానవ జీవితాన్ని శాసిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లేనిదే చిన్నా పెద్దలకు పొద్దు గడవడం లేదు. పిల్లలైతే స్మార్ట్ ఫోన్లతో గేమ్‌లతో కాలం గడిపేస్తున్నారు. పెద్దలైతే రకరకాల వీడియోలు చూస్తూ.. సోషల్ మీడియాలో గంటలు గంటలు వెచ్చిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అవుతున్నారు.. కొంతమంది పిల్లలు. హర్యానాలో స్మార్ట్ ఫోన్ కోసం తమ్ముడినే ఓ సోదరి హత్య చేసింది. కుమారుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిపెట్టారు. కానీ అతడు సోదరికి ఫోని ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. 
 
అంతే ఆవేశానికి గురైన అతడి సోదరి గొంతు నులిమి హత్య చేసింది. తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని భావించిన ఈ మైనర్ బాలిక.. తమ్ముడిని గొంతు నులిమి చంపేసింది. హరియాణాలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, ఆమె తమ్ముడు ఉత్తరప్రదేశ్‌లో తమ నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు. 
 
ఇటీవల వేసవి సెలవుల కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు తన ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. 
 
అతను ఇవ్వకపోవడంతో తమ్ముడి గొంతు నులిమి చంపేసింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments