Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గూశరం ఉంటే చంద్రబాబును చూసి నేర్చుకోండి : స్టాలిన్ ధ్వజం

ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచి

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (16:11 IST)
ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా నిలదీస్తున్నారో ఓసారి చూసి తెలుసుకోవాలన్నారు. 
 
తమిళనాడులోని ఈరోడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు.
 
కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోందని స్టాలిన్ విమర్శించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేసే విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ సెల్వంలకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments