Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016'': డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌లకు చెక్.. అగ్రస్థానంలో మోడీ

''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016''లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సత్తా చాటారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ రంగాల్లో ఐకాన్స్‌గా నిలిచిన కొ

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (17:03 IST)
''పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016''లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సత్తా చాటారు. ప్రతి ఏడాది టైమ్ పత్రిక సంపాదక బృందం ప్రపంచ నేతలు, అధ్యక్షులు, ఆందోళనకారులు, వ్యోమగాములు వంటి వివిధ రంగాల్లో ఐకాన్స్‌గా నిలిచిన కొంతమందిని ఎంపిక చేసి టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించింది. ఈ పోల్‌లో అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లను వెనక్కి నెట్టి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందంజలో ఉన్నారు. మోదీ ఈ పోటీలో వుండడం వరసగా ఇది నాలుగోసారి. 
 
గత ఏడాది కాలంలో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ గతేడాది పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచారు. ఈ ఏడాది పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పోలింగ్‌లో ఇప్పటివరకు పోలైన ఓట్ల ప్రకారం ప్రధాని మోడీ 21శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే 10శాతం ఓట్లతో ఉన్నారు. ఒబామా 7 శాతం, పుతిన్‌, ట్రంప్‌ 6 శాతం ఓట్ల చొప్పున సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
 
డిసెంబరు 4వ తేదీతో ఈ పోల్‌ ముగుస్తుంది. ఐదు మిలియన్ల ఓట్లు పోల్‌ కాగా అందులో 16 శాతానికి పైగా ఓట్లతో 2014లో టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ రీడర్స్‌ పోల్‌లో మోడీ తొలి స్థానంలో నిలిచారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments