Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ 'పప్పు' కాదు.. నిప్పు... : శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన వి

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:52 IST)
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రసంశల వర్షం కురిపించారు. రాహుల్ 'పప్పు' కాదనీ, నిప్పు అని త్వరలోనే నిరూపితమవుతుందన్నారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటైన విమర్శలు చేశారు. 
 
తాజాగా ఆయన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయన్నారు. ఈ రెండింటివల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. 
 
దేశంలో చాలా మంది నేతలు తమకుతామే గొప్ప అని విర్రవీగుతున్నారని... రాహుల్ గాంధీని 'పప్పు' అంటూ సంబోధిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ ప్రభావం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. 
 
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ స్పష్టమైన ప్రభావం చూపే పరిస్థితి నెలకొందన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి రాహుల్‌కు మాత్రమే ఉందని చెప్పారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేన... రాహుల్ గాంధీపై పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments